కంగనా భవనం కూల్చడం ప్రతీకార చర్య: ముంబయి హైకోర్టు

ముంబయి: నిబంధనలను అతిక్రమించారంటూ ముంబయిలోని కంగనారనౌత్‌కు చెందిన భవనాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కూల్చడం ప్రతీకారంతో కూడకున్న చర్య అని, ఇది చట్ట విరుద్దమని ముంబయి హైకోర్ట్ స్పష్టం చేసింది. కంగనా రనౌత్‌కు నష్టం చేకూర్చాలనే దుర్భిద్దితోనే ఈ భవనాన్ని కూల్చారని హైకోర్ట్ పేర్కొంది. ఈమేరకు కంగనాకు జరిగిన నష్టానికి మున్సిపల్ కమిషన్ జరిమానా కడుతుందని తీర్పునిచ్చింది. కంగనా భవనం ఇప్పటికే నిర్మించి ఉన్న భవనమని, ఒకవైళ ఏవైనా నిబంధనలు అతిక్రమించి ఉంటే భవన క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చనని, ఇంతలోనే తొందరపడి మున్సిపల్ కార్పొరేషన్ ఆ బిల్డింగ్‌ను కూల్చాల్సిన అవసరం లేదని హైకోర్ట్ పేర్కొంది. ఈ తీర్పు పట్ల కంగనా హర్షం వ్యక్తం చేసింది.