విద్యుత్ తీగలు తగిలి బస్సులో మంటలు: ముగ్గురి మృతి

జైపూర్ : రాజస్థాన్‌లోని ఢిల్లీ, జైపూర్ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి షార్ట్‌సర్క్యూట్ సంభవించి నిప్పంటుకొని ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రోజు ఉదయం ఢిల్లీ, జైపూర్ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.