జైడస్ బయోటెక్ పార్క్‌లో ప్రధాని మోడీ

అహ్మదాబాద్: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించేందకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు నగరాల పర్యటన ప్రారంభమైంది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌ను సందర్శించారు. కాసేపటిక్రితం ఆయన అహ్మదాబాద్ పారిశ్రామిక వాడకు చేరుకున్నారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేస్తున్న జైడస్ కంపెనీలో ఆయన సమీక్ష నిర్వహించారు. జైడస్ కంపెనీ జైకోవ్‌డీ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నది. ఇవాళ మూడు నగరాల్లో మోదీ టూర్ చేయనున్నారు. అహ్మదాబాద్‌లో టూర్ ముగిసిన తర్వాత మోదీ.. హైదరాబాద్, పుణె నగరాల్లోనూ టూర్ చేస్తారు. అక్కడ ఆయన భారత్‌బయోటెక్, సీరం సంస్థలను సందర్శించనున్నారు. కోవిడ్ టీకా రూపొందిస్తున్న ఫార్మా కంపెనీలతో ప్రధాని సంప్రదించనున్నారు. జైడస్ కాడిల్లా సంస్థ తన తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. ఆ సంస్థ జైకోవీడీ టీకాను తయారు చేస్తున్నది.
#WATCH Prime Minister Narendra Modi visits Zydus Biotech Park in Ahmedabad, reviews the development of #COVID19 vaccine candidate ZyCOV-D pic.twitter.com/vEhtNMf1YE
— ANI (@ANI) November 28, 2020