బలవంతపు మతమార్పుడి.. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఓకే

లక్నో: బలవంతపు మతమార్పిడిలను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ సర్కార్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదం తెలిపారు. పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని తప్పుపడుతూ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ గత వారం ఓ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అక్రమరీతిలో మతమార్పిడులకు పాల్పడేవారికి పదేళ్ల జైలుశిక్ష విధించనున్నారు. ఒకవేళ కేవలం పెళ్లి కోసమే మతం మార్చుకుంటే, అప్పుడు ఆ పెళ్లిని రద్దు చేయనున్నారు. అయితే పెళ్లి తర్వాత మతం మార్చుకోవాలనుకునేవారు మాత్రమ జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మాతమార్పుడులను నిలువరించేందుకు యూపీతో పాటు హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా కొత్త చట్టాలను తయారు చేయనున్నాయి.