ఉప్పుటేరులో ఇద్దరు యువకులు గల్లంతు

లింగసముద్రం(ప్రకాశం): ప్రకాశంలో జిల్లాలోని ఉప్పుటేరులో ఆటో బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన నాగిళ్ల అజరు, నాగిళ్ల బాబురావు, పెద్దపవనిలు ఆటోలో ఉప్పుటేరుపై నుండి వస్తున్నారు. ఆటో అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. శుక్రవారం అర్థరాత్రి నుండి పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. శనివారం అతి కష్టం మీద ఆటోని బయటికి తీశారు. యువకుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.