ఆ ఉగ్ర‌వాది స‌మాచార‌మిస్తే 37 కోట్లు..

హైద‌రాబాద్‌: 2008లో ముంబై దాడుల్లో కీల‌క పాత్ర పోషించిన ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాది సాజిద్ మిర్ స‌మాచారం ఇచ్చినా లేక ప‌ట్టిచ్చినా .. వారికి 50 ల‌క్ష‌ల డాల‌ర్లు న‌జ‌రానా ఇవ్వ‌నున్న‌ట్లు అమెరికా న్యాయ‌శాఖ పేర్కొన్న‌ది. పాక్ ఉగ్ర సంస్థ ల‌ష్క‌రేలో సాజిద్ మిర్ సీనియ‌ర్ స‌భ్యుడిగా ఉన్నారు. 2008 ముంబై ఉగ్ర‌దాడి కేసులో అత‌ను మోస్ట్ వాంటెడ్‌. రివార్డ్స్ ఫ‌ర్ జ‌స్టిస్ ప్రోగ్రామ్‌.. ఆ ఉగ్ర‌వాదిపై న‌జ‌రానా ప్ర‌క‌టించింది. అత‌డి స‌మాచారం ఇస్తే 37 కోట్లు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ముంబై దాడుల‌కు ల‌ష్క‌రే ఆప‌రేష‌న్స్ మేనేజర్‌గా సాజిద్ మిర్ చేశాడు. దాడుల ప్లానింగ్‌, ప్రిప‌రేష‌న్‌, ఎగ్జిక్యూష‌న్ అత‌నే చేశాడు. 2011, ఏప్రిల్ 21వ తేదీన చికాగో కోర్టులో మిర్‌పై నేరాభియోగం న‌మోదు చేశారు. ఆ త‌ర్వాత రోజున అరెస్టు వారెంట్ జారీ చేశారు. 2019లో ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో మిర్‌ను చేర్చారు.

Leave A Reply

Your email address will not be published.