మరోసారి వ్రకబుద్ధిని చాటుకున్న చైనా!
ఇండియా నుంచే కరోనా వైరస్ వచ్చి ఉండొచ్చని ఆరోపణలు చేసిన చైనా..

బీజింగ్: కరోనా వైరస్ విషయంలో ప్రపంచమంతా చైనాపై దుమ్మెత్తిపోస్తుంటే.. చైనా మాత్రం తన మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. కరోనా వైరస్‌కు ఇండియా కూడా కారణం కావచ్చని అక్కడి అధికార మీడియా నిరాధార ఆరోపణలు చేస్తోంది.వైరస్ మొదట చైనాలో కనిపించినంత మాత్రాన అది ఇక్కడి నుంచే మొదలైందని ఎలా ఆరోపిస్తారని విమర్శిస్తోంది.విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తుల నుంచే వుహాన్‌కు కరోనా వైరస్ వచ్చిందని వాదిస్తోంది.ఇందులో ఇండియా నుంచి వచ్చిన ఒక చేపల కన్‌సైన్‌మెంట్ కూడా ఉన్నదని, అందులోనూ కరోనా వైరస్ జాడలు కనిపించినట్లు చెబుతోంది.ఈ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దర్యాప్తు మొదలుపెట్టనున్న సమయంలో చైనా ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. అసలు కరోనా వైరస్ వుహాన్‌లో కనిపించిందా లేక అక్కడే పుట్టిందా అన్న అంశంపై డబ్ల్యూహెచ్‌వో విచారణ చేపట్టనుంది.చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ కూడా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు.