కిరికిరి పెట్టి సాయం ఆపేశారు..

ఆలోచించి ఓటు వేయండి
హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలే
అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా : సీఎం కేసీఆర్
హైదరాబాద్: వరదల్లో పేదల బాధలు చూసి ఇంటికి రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని, రూ.10 వేల సాయాన్ని ఏ నగరంలో ఇవ్వలేదని సిఎం కెసిఆర్ అన్నారు. వరద సాయం అందిస్తే కొందరు కిరికిరి పెడుతున్నారని మండిపడ్డారు. ఎస్ఇసిని ఇబ్బంది పెట్టి 10 వేలు సాయం నిలిపి వేశాయించారని అన్నారు. రాబోయే కొద్ది నెలల్లో హైదరాబాద్ నగరానికి 24 గంటలు నీళ్లు సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని..మరోసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిపించండి అని కేసీఆర్ కోరారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలేనని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు.
ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్ ప్రగతి శంఖారావం సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సభకు విచ్చేసిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. అందరికీ తానొకటే మాట విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు చాలా జరుగుతుంటాయి. సందర్భాలు చాలా వస్తుంటాయి.. పోతుంటాయన్నారు. ఎన్నికల్లో విచక్షణ అధికారాన్ని వినియోగించి పార్టీలకు ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని కోరారు. ఒక పార్టీ, ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఎలా ఆలోచిస్తున్నారు. ఎలా పనిచేస్తున్నారు. వాళ్ల దృక్పథం ఎలా ఉంది. వాళ్ల వైఖరి ఏ విధంగా ఉంది. వాళ్లు ఏ విధంగా అభివృద్ధిపై ఆలోచిస్తున్నారు. భవిష్యత్తు కోసం వాళ్లు అవలంభిస్తున్న విధానాల మీద చర్చ జరగాలే. వాళ్లు వాళ్లు ప్రతిపాధించుకున్న ఎజెండా మీద చర్చ జరగాలి. అట్లా జరిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. మంచి మంచి నిర్ణయాలు వస్తాయన్నారు. మంచి పార్టీలు ఎన్నుకోబడతాయన్నారు. అప్పుడే పనిచేసేవాళ్లు చాలా మంది పుట్టుకొస్తారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా సమాజానికి, ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అవలంభిస్తున్న పద్ధతి ఇదేనని సీఎం పేర్కొన్నారు.
‘హైదరాబాద్ గడ్డపై ఉన్న ప్రతి బిడ్డా మావారే అని చెప్పాం. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని మా బిడ్డలుగానే చూస్తున్నాం. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? అనే చర్చ ప్రజల్లో జరగాలి. ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఓటు వేసేముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలి. పార్టీలకు ఓటు వేసేముందు ప్రజలు ఆలోచించాలి. అప్పుడే మంచినేతలు రాజకీయాల్లో ఉంటారు. ఎన్నికలు చాలా జరుగుతుంటాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసే ఓటు వేయాలి. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని’ సీఎం కోరారు.
‘హైదరాబాద్ చైతన్యవంతమైనది..చరిత్ర ఉన్నది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్ అని కేంద్రం చెప్పింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మనం సాధించిన తొలి ఘనత విద్యుత్. తాగునీటి సమస్యకు భరతవాక్యం పలికాం. ఎంతో కృషి, పట్టుదలతో కోతలు లేని విద్యుత్ అందిస్తున్నామని’ సీఎం చెప్పారు.
‘నగర ప్రజలు, పేదలకు కేసీఆర్ అందించిన కానుక ఉచిత తాగునీరు. అపార్ట్‌మెంట్లలో ఉన్న ప్రతి కుటుంబానికి 20వుల లీటర్ల ఉచిత మంచినీరు పథకం అమలు చేస్తాం. ఐదేళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేశాం. మేం ఇస్తున్న రైతుబంధు ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ప్రతీ రైతు కుటుంబానికి రూ.5లక్షల రైతుబీమా అమలు చేస్తున్నాం. యావత్ నగర ప్రజల కోసం 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం. కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు పథకాలు ఎక్కడా లేవు. కేసీఆర్ కిట్ అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నాం. కేసీఆర్ కిట్టు..సూపర్ హిట్టు’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
‘దోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. కరోనాతో రాష్ట్రానికి రూ.52వేల కోట్ల ఆదాయం కోల్పోయినా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదు. హైదరాబాద్ కోసం కేంద్రాన్ని అడిగినా పట్టించుకోలేదు. హైదరాబాద్ నగరం అశాస్త్రీయంగా పెరిగింది. సరైనా మౌలిక వసతులు లేకుండా కాలనీల నిర్మాణాలు జరిగాయి. వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలి. దీని కోసం ఏటా 10వేల కోట్లు కేటాయిస్తామని’ సీఎం చెప్పారు.
కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- హైదరాబాద్ చాలా చైతన్యవంతమైన నగరం.ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి.భవిష్యత్ కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలి.అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
- అపోహలు, అనుమానాలపై సుదీర్ఘపోరాటం ద్వారా తెలంగాణ సాధించుకున్నాం.కరెంట్ ఉండదు, నీళ్లు రావు, పరిశ్రమలు వెళ్లిపోతాయన్నారు.హైదరాబాద్ ఖాళీ అవుతుందని శాపాలు పెట్టారు.అయినా ప్రజలు టీఆర్‌ఎస్‌ను విశ్వసించారు.
- హైదరాబాద్‌లో ఉన్న ప్రతి బిడ్డా.. మా బిడ్డే. ఎక్కడా కుల, మత, ప్రాంతీయ వివక్షలు లేకుండా ముందుకెళ్లాం. కరెంట్ సమస్యను పరిష్కరించాం.. 24 గంటలూ కరెంట్ ఇస్తున్నాం. ఏరోజు మేం పక్షపాత నిర్ణయాలు చేయలేదు. అంచనాలను మించి మిషన్ భగీరథను విజయవంతం చేశాం.
- రాష్ట్ర ప్రజలకు 24 గంటలూ మంచినీరు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ఢిల్లీ, నాగపూర్‌లలో ఇప్పటికే అధ్యయనం చేశాం. 20వేల లీటర్ల వరకు నల్లా బిల్లులు రద్దు చేస్తాం. ఢిల్లీ తర్వాత దేశంలో తెలంగాణలో మాత్రమే నల్లా బిల్లులు రద్దు చేసింది. దీన్ని అపార్ట్‌మెంట్లకూ వర్తింపజేస్తాం.
- కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు పథకాలు ఎక్కడా లేవు. కేసీఆర్ కిట్టు… సూపర్ హిట్టు. ప్రతి రైతుకు రైతు బీమా పథకాన్ని అందించాం. 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాం.
- సెలూన్లకు ఉచిత విద్యుత్ అందిస్తాం. దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం..
- కరోనాతో రాష్ట్రానికి రూ.52వేల కోట్ల ఆదాయం కోల్పోయినా..ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదు.
- హైదరాబాద్ నగరం అశాస్త్రీయంగా పెరిగింది. సరైన మౌలిక వసతులు లేకుండా కాలనీల నిర్మాణాలు జరిగాయి.కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.
- హైదరాబాద్‌లో గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోంది. అభివృద్ధిని కొనసాగించాలి.
- మరోసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించండి. వరదల నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తిని కలిగిస్తాం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను తెస్తున్నాం.శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో సేవలను పొడిగిస్తాం.
- గోదావరితో మూసీనదిని అనుసంధానం చేసి ప్రక్షాళన చేస్తాం.హైదరాబాద్‌కు అందమైన మూసీని అందించే బాధ్యత నాది.