డిసెంబర్ 7 నుంచే మళ్లీ వరదసాయం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: హైదరాబాద్‌ను ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, వరదలు ముంచెత్తాయి.. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, వరద బాధితులను సాయం ప్రకటించిన ప్రభుత్వం.. కొంతవరకు వరదసాయాన్ని అందించింది.. ఇదే సమయంలో.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. వరదసాయం పంపిణీ నిలిచిపోయింది. అయితే, వరద బాధితులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… డిసెంబర్ 7 నుంచే మళ్లీ వరదసాయం అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ వరదలు చూసి చలించిపోయా. లక్షల మంది పేదల బతుకులు ఆగమవడం చూసి చాలా బాధపడ్డాను. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు.. కానీ, దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు సాయం అందజేశామని వెల్లడించారు కేసీఆర్.. గ్రేటర్ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ పోతుంది.. ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీ తర్వాత వరద సాయం అందని వారికి అందిస్తాం అన్నారు.
`గ్రేటర్` ఎన్నికల ప్రచార సభలో సీఎం మాట్లాడుతూ.. . `’హైదరాబాద్ వరదలు చూసి చలించిపోయా. లక్షల మంది పేదల బతుకులు ఆగమవడం చూసి చాలా బాధపడ్డాను. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు సాయం అందజేశాం. డిసెంబర్ 7 తర్వాత వరద సాయం అందని వారికి అందిస్తాం. హైదరాబాద్ ప్రజలకు హామీ ఇస్తున్నా.. మరో రూ.300 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడదు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సాయం అందిస్తాం. ప్రధానిని రూ.1300 కోట్ల సాయం అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదు. మేం భారతదేశంలో లేమా. బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలకు సాయం ఇవ్వలేదా’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
‘వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతా. వరదసాయం చేయాలని నన్ను ఎవరూ అడగలేదు. వరదలు వచ్చిన ఏ నగరంలోనూ ప్రభుత్వాలు సాయం చేయలేదు. వరదసాయం చేస్తుంటే కొందరు కిరికిరి పెట్టారు. ఏ నగరంలోనూ ఇవ్వని విధంగా 6.5లక్షల మందికి 650 కోట్లు ఇచ్చాం. ఈసీకి కంప్లైంట్ చేసి కొందరు వరదసాయం బంద్ చేయించారు. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌లోనూ వరదలు వచ్చాయి. మంత్రులంతా మోకాళ్లలోతు నీళ్లలో తిరిగారు. కొందరి కోసం పనిచేసి అందరినీ ఆగం చేయం. ఆర్థిక ఇబ్బందులున్నా..సంక్షేమ పథకాలు ఆపలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత మా ప్రభుత్వమే ఉంటుంది. శాంతిభద్రతల విషయంలో ఆరేళ్లుగా రాజీపడలేదు. రౌడీమూకలను అణచివేశాం. హైదరాబాద్‌లో ఉన్న సీసీ కెమెరాలు దేశంలో ఎక్కడా లేవని’ సీఎం పేర్కొన్నారు.
‘హైదరాబాద్ గడ్డపై ఉన్న ప్రతి బిడ్డా మావారే అని చెప్పాం. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని మా బిడ్డలుగానే చూస్తున్నాం. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? అనే చర్చ ప్రజల్లో జరగాలి. ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఓటు వేసేముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలి. పార్టీలకు ఓటు వేసేముందు ప్రజలు ఆలోచించాలి. అప్పుడే మంచినేతలు రాజకీయాల్లో ఉంటారు. ఎన్నికలు చాలా జరుగుతుంటాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసే ఓటు వేయాలి. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని’ సీఎం కోరారు.
‘హైదరాబాద్ చైతన్యవంతమైనది..చరిత్ర ఉన్నది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్ అని కేంద్రం చెప్పింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మనం సాధించిన తొలి ఘనత విద్యుత్. తాగునీటి సమస్యకు భరతవాక్యం పలికాం. ఎంతో కృషి, పట్టుదలతో కోతలు లేని విద్యుత్ అందిస్తున్నామని’ సీఎం చెప్పారు.
‘నగర ప్రజలు, పేదలకు కేసీఆర్ అందించిన కానుక ఉచిత తాగునీరు. అపార్ట్‌మెంట్లలో ఉన్న ప్రతి కుటుంబానికి 20వుల లీటర్ల ఉచిత మంచినీరు పథకం అమలు చేస్తాం. ఐదేళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేశాం. మేం ఇస్తున్న రైతుబంధు ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ప్రతీ రైతు కుటుంబానికి రూ.5లక్షల రైతుబీమా అమలు చేస్తున్నాం. యావత్ నగర ప్రజల కోసం 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం. కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు పథకాలు ఎక్కడా లేవు. కేసీఆర్ కిట్ అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నాం. కేసీఆర్ కిట్టు..సూపర్ హిట్టు’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
‘దోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. కరోనాతో రాష్ట్రానికి రూ.52వేల కోట్ల ఆదాయం కోల్పోయినా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదు. హైదరాబాద్ కోసం కేంద్రాన్ని అడిగినా పట్టించుకోలేదు. హైదరాబాద్ నగరం అశాస్త్రీయంగా పెరిగింది. సరైనా మౌలిక వసతులు లేకుండా కాలనీల నిర్మాణాలు జరిగాయి. వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలి. దీని కోసం ఏటా 10వేల కోట్లు కేటాయిస్తామని’ సీఎం చెప్పారు.