30న వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 30న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. హండియా(ప్రయాగ్ రాజ్)- రాజతలాబ్ (వారణాసి) మధ్య పూర్తయిన ఆరులేన్ల జాతీయ రహదారి-19ని ఆయన జాతికి అంకితం చేయన్నారు. అనంతరం ఆయన దేవ్ దీపావళి వేడుకల్లో పాల్గొని కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ ప్రాంతంతోపాటు సారనాథ్ పురావస్తుశాఖ మ్యూజియంను సందర్శించున్నట్లు శనివారం ప్రధాని కార్యాలయం తెలిపింది.