అభిమాన సంఘాల అధ్యక్షులతో తలైవా మీటింగ్..!

చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న తమిళ నాడు ఎన్నికలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు కమల్ హాసన్ ఇప్పటికే సిద్దం కాగా, రజనీకాంత్ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా వలన రజనీకాంత్ కాస్త వెనక్కు తగ్గాడని ఈ మధ్య ఓ ప్రచారం అయితే జోరుగా జరగగా, దీనిపై డిసెంబర్‌లో పూర్తి క్లారిటీ రానుందని అభిమానులు భావించారు.. ఈ నేపథ్యంలో రజినీకాంత్ మరోసారి రాజకీయ ఉత్కంఠతకు తెర తీశారు. తన అభిమాన సంఘానికి చెందిన అధ్యక్షులను నవంబర్ 30న చెన్నైకు రావాలంటూ పిలుపునిచ్చారు. వారితో ఉదయం తొమ్మిది గంటలకు మీటింగ్ ఉంటుందట. సూపర్‌స్టార్ అసలు ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. సోమవారం జరగబోయే మీటింగ్‌లో తన రాజకీయ రంగ ప్రవేశంపై సూపర్‌స్టార్ క్లారిటీ ఇస్తారని అందరూ అనుకుంటున్నారు.