చత్తీస్‌గఢ్‌ అడవుల్లో బాంబు పేలి.. సిఆర్‌పిఎఫ్‌ అధికారి మృతి

రాయ్‌పూర్‌: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. సెంట్రల్‌ రిజర్వ్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌) బ‌ల‌గాలే ల‌క్ష్యంగా మందుపాత‌ర పేల్చారు. ఈ ఘ‌ట‌న‌లో అసిస్టెంట్ క‌మాండెంట్ న‌తిన్ భ‌లేరావు (33) ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. రాయ్పూర్‌కు 450 కిలో మీటర్ల దూరంలో చింతల్‌నూర్‌ అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన జరిగిందని తెలిపారు. క్షతగాత్రులను విమానంలో ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ అధికారులంతా 206వ కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసోల్ట్‌ యాక్షన్‌ ( కోబ్రా) చెందిన వారని తెలిపారు. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు సిఆర్‌పిఎఫ్‌, స్థానిక సంయుక్త పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపడుతుండగా ఈ బాంబు పేలిందని వెల్లడించారు. ఈ ఘటనలో సిఆర్‌పిఎఫ్‌ అధికారి నితిన్‌ భలేరావ్‌ తీవ్రంగా గాయపడి..ఆదివారం ఉదయం మరణించారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.