టిడిపి కార్యకర్తలపై వైసీపీ నాయకుల అక్రమ కేసులు!

తెలుగుదేశం పార్టీ నాయకులు గంటి హరీష్ మాధుర్ ఆరోపణ

కాజులూరు: తూ.గో జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు గంటి హరీష్ మాధుర్ వెల్లడించారు. ఆదివారం కాజులూరు మండలం గొల్లపాలెం లో జరిగిన మండల తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ కార్యకర్తలను ఆదుకుంటామని అమలాపురం పార్లమెంటరీ పరిధిలో ప్రతి గ్రామంలో పర్యటించి కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ అయిన వైఎస్సార్సీపీ గ్రామ స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు తెలుగుదేశం నాయకుల పై వేధింపులు అక్రమ చర్యలకు పాల్పడుతోందని ఆయన తమ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో 75% వరి పంటకు నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. ప్రతి ఎకరానికి 25000 చొప్పున నష్టపరిహారం రైతులకు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి తాను కృషి చేస్తానని ఆయన వివరించారు. ఈ సమావేశానికి రాయుడు భాస్కర రావు అధ్యక్షత వహించారు. చుండ్రు వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నెక్కంటి బాలకృష్ణ, చింతపల్లి వీరభద్రరావు, గరికిపాటి సూర్యనారాయణ, తీరెడ్డి సత్తిబాబు, బండారు సత్తిబాబు, పేరా బత్తుల రాజ శేఖర్, పలివెల వెంకట రమణ, సూర్యనారాయణ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. మండల సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సలాది సాయిబాబా కార్యదర్శిగా పెంకే అప్పన్నబాబు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని తెలుగుదేశం నాయకులు హరీష్ మాధుర్ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.