మండపేటలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అఖండ దీపారాధన..
మండపేట: కార్తీకమాసం అతి పవిత్రమైన మాసం. అలాంటి పవిత్రమైన మాసంలో పౌర్ణమి రోజున భక్తులు శివనామస్మరణతో ధనధాన్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని శివనామస్మరణతో దీపారాధన చేయడం గొప్ప వరంగా భావిస్తారు. అలాంటి కార్తీక పౌర్ణమి ఆయన ఆదివారం స్థానిక తరవాణి పేట శ్రీ శిరిడి సాయి బాబా ఆలయం నందు ఆలయ వ్యవస్థాపకులు కాసా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అఖండ దీపారాధన జరిగింది. ఆలయ అర్చకులు అయినవిల్లి ఆనంద్ ప్రత్యేక పూజలు చేసారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించారు. సంవత్సరమంతా ఏ ఇబ్బందులు కలగకూడదని 365 వత్తులు వెలిగించి శివనామస్మరణ చేశారు. ఈ అఖండ దీపారాధన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుండు తాత రాజు, పసుపులేటి వెంకటరావు, దూలం చక్రవర్తి, కోన సత్యనారాయణ, దుంగ ప్రసాద్, పడాల చిన్నబాబు, రాము తదితరులు పాల్గొన్నారు.