షాహిదా హత్య కేసులో నిందితులకు ఉరి శిక్ష వేయాలి..
మండపేట: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో ముస్లిం వనిత షాహిదా హత్యకేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, అదేవిధంగా దిశ చట్టం కింద నిందితులను అరెస్టు చేసి ఉరిశిక్ష విధించాలని మండపేట పట్టణ ముస్లిం ఐక్య సంఘం, మహిళా సంఘాలు పట్టణంలో శనివారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన షాహిదాబి అదే గ్రామానికి చెందిన రఘు ప్రేమించుకున్నారు. అయితే వారి వారి తల్లిదండ్రులు వారిరువురికి ఇతరులతో పెళ్లిళ్లు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియుడైన రఘు ప్రియురాలిని హతమార్చాడు. ఈ నెల 21న షాహిదా అనంతపురం సమీపంలోని కామర్ల పల్లి గ్రామానికి చెందిన ఒక యువకుని తో ఈ నెల 21న వివాహం జరగాల్సి ఉంది. అదే విధంగా రఘుకు ఉరవకొండ మండలం హావళిగి గ్రామానికి చెందిన ఒక యువతితో వివాహం జరగాల్సి ఉంది. ఈ నెల 17న ప్రేమికులు ఇద్దరు ఇంటి నుండి వెళ్లిపోయారు. దీంతో ప్రేమికుల తల్లిదండ్రులు ఇరువురు గాలించారు. అయితే షాహిదా మృతదేహం అనుమానాస్పదస్థితిలో దొరికింది. ఆమె ప్రియుడు రఘు హత్య చేసి ఉంటాడని షాహిదా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు రఘుని గాని అతని తల్లిదండ్రులను గాని పోలీసులు అరెస్టు చేయకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేపట్టారు.