నైజీరియాలో 43 మంది రైతులను పొట్టనబెట్టుకున్న మిలిటెంట్లు
బోర్నో: నైజీరియాలో పొలంలో పనులకు వెళ్లిన 43 మంది రైతులను బోకో హరమ్ మిలిటెంట్లు అతి కిరాతకంగా చంపేశారు.వీరిలో కొందరిపై కాల్పులు జరపగా, మరికొంత మంది రైతులను చేతులు,కాళ్లూ కట్టేసి గొంతు కోసి చంపేశారు.ఆదివారం జరిగిన ఈ అమానవీయ ఘటనతో నైజీరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఇస్లామిక్ మిలిటెంట్ల పనిగా నైజీరియా భావిస్తోంది.నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.చనిపోయిన వారందరికీ నైజీరియా ప్రభుత్వం సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించింది. అయితే.. ఇంకా చాలా మంది రైతులు అదృశ్యమైనట్లు తెలిసింది.కనిపించకుండా పోయిన వారిలో 10 మంది మహిళలు కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహ్మద్ బుహారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనపై యావత్ దేశం చింతిస్తోందని ఆయన చెప్పారు.