అసెంబ్లీ ఆవరణలో చంద్రబాబు బైటాయింపు.. మార్షల్స్ తీరుపై ఆగ్రహం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశాల్లో భాగంగా పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును చర్చించకుండానే ఆమోదించినందుకుగానూ టిడిపి సభ్యులు అసెంబ్లీ సమావేశాల నుండి వాకౌట్ చేసిన విషయం విధితమే. అనంతరం అసెంబ్లీ ముందు చంద్రబాబు, సభ్యులు బైటాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ్యులను ఫొటో తీయనియకుండా మార్షల్స్ అడ్డుగా నిల్చున్నారు. ఈ క్రమంలో చీఫ్ మార్షల్‌కు, పయ్యావుల కేశవ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన వ్యక్తం చేయడానికి కూడా హక్కు లేదా? అని మండిపడ్డారు. కాసేపటికి టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి ప్రదర్శనగా బయలుదేరారు.