మంత్రి పువ్వాడ కారుపై బిజెపి కార్యకర్తల దాడి

హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల వేళ హైదరాబాద్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూకట్పల్లి ఫోరమ్మాల్ వద్ద బిజెపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టిఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు. అలాగే తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఓ తెరాస కార్యకర్తను బిజెపి కార్యకర్తలు తీవ్రంగా కొట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బిజెపి కార్యకర్తలను చెదరగొట్టారు.