సబ్సిడీ సిలిండర్లపై రూ. 50 పెంపు

న్యూఢిల్లీ : ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుకుంటూ పోతున్న చమురు సంస్థలు తాజాగా సబ్సిడీ సిలిండర్లపై రూ. 50 పెంచాయి. దీంతో వినియోగదారులపై మరింత భారం పడినట్లయింది. ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ. 594గా ఉన్న సబ్సిడీ సిలిండర్‌ ధర రూ. 644కు పెరిగింది. గృహ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌పై రాయితీ కల్పిస్తోన్న సంగతి విదితమే. ఆయా రాష్ట్రాల్లో వివిధ పన్నులు కలుపుకుని గ్యాస్‌ ధర పెరగనుంది. ఈ పెరిగిన ధరలు నేటి నుండి అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న వంట గ్యాస్‌ ధరలకు తాజాగా రెక్కలచ్చాయి. వినియోగదారులు కేవలం 12 సిలిండర్లను రాయితీతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ కొనుగోలు చేయాలంటే మార్కెట్‌ ధరల ప్రకారం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.