ఏసీబీ వలలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ

నెల్లూరు : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయ్‌కుమార్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం రెండు ఇళ్లు ,5 స్థలాలు,14 ఎకరాల వ్యవసాయ భూమి ,ఒక కేజీ బంగారం, 50 లక్షల బ్యాంకు డిపాజిట్లు గుర్తించినట్లు తెలిపారు. మరిన్ని సోదాలు నిర్వహిస్తామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ శాంత్రో పేర్కొన్నారు.