బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఇవాళ దేశవ్యాప్తంగా భారత్‌బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ బంద్‌ను సంపూర్ణంగా నిర్వహించాలని సీఎం కేజీఆర్ కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లు సంయుక్తంగా ఇవాళ మహబూబాబాద్ జిల్లా నర్సంపేట రోడ్డు చౌరస్తాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ బైక్‌ను రైడ్ చేస్తుండగా.. మంత్రి సత్యవతి ఆ బైక్‌పై వెళ్లారు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని మంత్రి కోరారు. ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఫరీద్ ఇతర నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.