ఏలూరులో 585కు చేరిన బాధితులు..
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పరిసరాల్లో ప్రజలు గత కొద్ది రోజులుగా తెలియని వ్యాధి బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ సంఖ్య ఈరోజు (బుధవారం) కి 585కు చేరింది. ఇప్పటివరకు వారిలో 503 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 58 మంది ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు వింత లక్షణాలతో అస్వస్థతకు గురైన వారిలో 22 మందిని ఏలూరు వైద్యులు విజయవాడకు పంపారు. అయితే ఈవ్యాధికి గల కారణాలు ఇంకా తెలియని పరిస్థితి నెలకొంది.
ఏలూరులో ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. వ్యాధి బారినపడి ఇప్పటికే డిశ్చార్జి అయి ఇంటి వద్ద ఉన్న బాధితుల వివరాలను వైద్యుల బృందం అడిగి తెలుసుకుంది. త్రాగునీటి శాంపిల్స్‌తో పాటు బాధితుల రక్త నమూనాలను కేంద్ర బృందం సేకరిస్తుంది.