ఏలూరు వింత వ్యాధితో మరో ఇద్దరి మృతి

ఏలూరు: ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో వింత రోగాలు కలకలం సృష్టిస్తున్నాయి. వైద్య నిపుణులు శాంపిల్స్ సేకరిస్తున్నారు.. రకరాల టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.. అయితే, ఈ వింత రోగాలకు అసలు కారణం సీసం మరియు ఆర్గానో క్లోరిన్‌ కారణమని ప్రాథమికంగా అంచనా వేసిశారు కానీ పూర్తిస్థాయిలో అనుమానులు తొలగిపోలేదు అంటున్నారు వైద్య నిపుణులు. తాజాగా ఈ వింత వ్యాధితో మరో ఇద్దరు మృతి చెందారు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితులు మృత్యువాతపడ్డారు. వింత వ్యాధితో బాధపడుతున్న 30 మందిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సుబ్బరావమ్మ [56], అప్పారావు {50} మృతి చెందారు. మృతురాలు సుబ్బరావమ్మ కరోనాతో మృతుడు అప్పారావు ఊపిరితిత్తుల సమస్య కూడా ఉందని వైద్యులు వెల్లడించారు. వింత వ్యాధితో బాధపడుతూ ఈ నెల 6న శ్రీధర్‌ మృతి చెందిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.