రైతు వేదికను ప్రారంభించిన కెసిఆర్

సిద్దిపేట: జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నది. సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లిలో కొత్తగా నిర్మించిన రైతు వేదికను సీఎం ప్రారంభించారు. అంతకుముందు దుద్దెడలో ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేశారు. పొన్నాల శివార్లలో కొత్తగా నిర్మించిన తెలంగాణ భవన్‌ను ప్రారంభించారు. తర్వాత ఎన్సాన్‌పల్లిలో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.