కలబంద (అలోవెరా) – ప్రయోజనాలు

అలోవెరా సౌందర్యసాధనంగా ఉప‌యోగిస్తార‌ని మ‌నంద‌రికి తెలిసిన విష‌య‌మే. వ్యాధుల నివార‌ణ‌కు కూడా దీన్ని ఔషధంగా వాడతారు. విపరీతమైన తల నొప్పి లేస్తే అలోవెరా గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి నొసట రాసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. కళ్ళకలక వస్తే దీని గుజ్జును కళ్ళ పైన రాసుకుంటే తగ్గిపోతుంది. కీళ్ల నొప్పులు ఎక్కువ అయినప్పుడు అలోవెరా గుజ్జులో ఆవనూనె కలిపి నొప్పుల పై లేపనం చేయాలి ఆ తర్వాత కాపు కోవాలి కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఉత్తర భారతదేశంలో అలోవెరాతో లడ్డు తయారు చేసుకొని తింటారు.. అలోవెరా ఆలుగడ్డ కర్రీ చాలా ఇష్టంగా తింటారు దీనివల్ల లివర్ సమస్యలు తగ్గుతాయి జీర్ణక్రియ బాగుపడుతుంది.

అలోవెరా గుజ్జు కొద్ది చేదుగా ఉంటుంది. తేనెతో కలిపి ప్రతి రోజు తింటే శరీరానికి మంచి బలాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది.
కడుపులో గ్యాస్ సమస్య ఎక్కువైనప్పుడు కొద్దిగా అలోవెరా గుజ్జు, కొద్దిగా ఆవు నెయ్యి, కొద్దిగా కరక్కాయ పొడి మరియు సైంధవ లవణం కలిపి తినిపిస్తే కడుపు లోని గ్యాస్ బయటికి నెట్టబడుతుంది స్త్రీలకు గర్భాశయానికి మంచి రక్త ప్రసరణ జరిగి కండరాలను గట్టిపరుస్తుంది. స్త్రీలకు స్థనాల్లో ట్యూమర్స్ వస్తే కలబందను నిలువుగా కోసి వేడి చేసి స్థనాలపై కడితే కొద్దిరోజుల్లో ట్యూమర్ కరిగిపోతుంది. క్యాన్సర్ వ్యాధి తగ్గడానికి గోధుమ గడ్డి రసంలో అలోవెరా గుజ్జు కలిపి ఉదయం సాయంత్రం తినిపిస్తే క్యాన్సర్ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. మగవారికి ప్రోస్టేట్ సమస్య వస్తే మూత్ర ధారా సన్నబడుతుంది. కలబంద రసంలో కొద్దిగా నల్ల నువ్వుల నూనె బెల్లం కలిపి తినిపిస్తే మూత్రం ఫ్రీగా వస్తుంది. మొలల వ్యాధిలో రక్తం పడుతుంటే కలబంద రసంలో చక్కెర కలిపి తినిపించాలి. కలబంద గుజ్జును క్రింద ఆసనంపై వేసి కట్టు కట్టాలి మొలల వ్యాధి తగ్గిపోతుంది సియాటికా నొప్పి వచ్చినప్పుడు అలోవెరా గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి లేపనంగా పూస్తే నొప్పి తగ్గిపోతుంది

– పి . కమలాకర్ రావు

Leave A Reply

Your email address will not be published.