డైపర్లు వేసుకోండి!

బీజింగ్: కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాలకు ప్రయాణించే విమాన సిబ్బంది విమానాల్లోని టాయ్లెట్లను వాడొద్దని, అందుకు బదులుగా డైపర్లు వేసుకోవాలని చైనా ఆదేశించింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ఆదేశాలు జారీచేసింది. ప్రతి పది లక్షల జనాభాలో 500కు పైగా వైరస్ కేసులు రికాైర్డెన దేశాలకు ప్రయాణించే విమానాల్లోని సిబ్బంది ఈ ఆదేశాలు తప్పకుండా పాటించాలని పేర్కొంది. విమాన ప్రయాణంలో సిబ్బంది.. ముఖానికి మెడికల్ ప్రొటెక్టివ్ మాస్కులు, చేతులకు గ్లౌజులు, కండ్లద్దాలు, టోపీలు, షూ కవర్లు కూడా ధరించాలని సూచించింది.