చంద్రునిపైకి భారత సంతతి వ్యక్తి

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ మిషన్ టూ ద మూన్ (చంద్రయాన్)’కి భారత సంతతికి చెందిన వైమానిక దళ వ్యోమగామి కల్నల్ రాజా చారి ఎంపికయ్యారు. చంద్రునిపైకి వెళ్లేందుకు అవసరమైన శిక్షణ నిమిత్తం 18 మందిని ఎంపిక చేయగా..కల్నల్ కు కూడా స్థానం దక్కింది.ఆయన 2017లో వ్యోమగాముల శిక్షణా తరగతిలో చేరేందుకు ఎంపికయ్యారు. ఆ శిక్షణ పూర్తి చేసుకున్న ఆయన..ఇప్పుడు చంద్రయాన్ శిక్షణకు ఎంపికయ్యారు. ఎంపికైన 18 మందిలో 9మంది మహిళలే ఉండటం గమనార్హం.