70 లక్షల మంది క్రెడిట్, డెబిట్ కార్డుల డేటా లీక్‌!

న్యూఢిల్లీ: ప్ర‌భుత్వాలు, అధికారులు.. ప్ర‌‌జల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ఎప్పటికప్పుడు ప్రచారం కల్పిస్తున్నా నేరస్థులు కొత్త తరహాలో మోసాలు చేయడంతో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి.  నిత్యం షాపింగ్‌, ఇతర కొనుగోళ్లకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను స్వైప్ చేయ‌వ‌ల‌సిన ప‌రిస్థితి నెల‌కొంది. అయితే, ఈ సమాచారమంతా లీక్‌అవుతోందట. ఇప్పటికే 70 లక్షల మంది భారతీయుల క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల డేటా ఆన్‌లైన్‌లో లీక్‌ అయినట్లు ఇండియన్‌ ఇండిపెండెంట్‌ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాజ్‌శేఖర్‌ రాజహరియా గుర్తించారు. ఈ డేటాను డార్క్‌వెబ్‌ ఫోరమ్‌లనుంచి స్క్రాప్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు.

రాజహరియా భారతదేశంలోని క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల మాస్ డేటాను కలిగి ఉన్న గూగుల్ డ్రైవ్ ఫోల్డర్‌ను షేర్‌చేశారు. ఇది 58 స్ప్రెడ్‌షీట్‌లతో కూడిన 1.3జీబీ ఫోల్డర్ కలిగి ఉంది. ఇందులో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల డేటా బ్యాంకు లేదా నగరం ఆధారంగా వర్గీకరించబడి ఉంది. ప్రతి దానిలో వందలు, వేల ఎంట్రీలున్నాయి. ఈ డేటా ఫోల్డర్‌ను వివిధ సోర్సెస్‌ నుంచి సేకరించారు. బ్యాంకుల భాగస్వామ్యంతో పనిచేస్తున్న థర్డ్‌ పార్టీ సర్వీసులు, ఇతర పార్ట్‌నర్స్‌ అసురక్షితంగా సేవ్‌చేసిన డేటా ఇది. అయితే, ఆర్థిక లావాదేవీలు చేపట్టే్ందుకు ఈ డేటాను నేరుగా ఉపయోగించే అవకాశం లేదట. కానీ, ఈ డేటా అటాకర్స్‌ చేతిలో పడితే ఎంత ప్రమాదం జరుగుతుందో చెప్పలేమని రాజహరియా పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.