ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య

మహబూబాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మడత జ్యోతి (25) వివాహం కల్వల గ్రామానికి చెందిన నరేశ్‌తో 2015లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది జ్యోతి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.