బండారు దత్తాత్రేయకు పౌర సన్మానం

న‌ల్ల‌గొండ‌: పట్టణంలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్‌ హాల్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్ బండారు దత్తాత్రేయ కు పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… నల్లగొండ ప్రజలు పౌర సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. గవర్నర్ గా ఉన్న తనను సన్మానించడం అంటే రాజ్యాంగాన్ని సన్మానించినట్టేన్నారు. అందరూ చెట్లు నాటాలని తెలిపారు. ఈరోజు ప్రమాదంలో ఆ చెట్లే నన్ను కాపాడాయని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం, భగవంతుడు ఆశీర్వాదం వల్ల చాలా ఆరోగ్యంగా వున్నానని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలిసి ప్రముఖులంతా నన్ను ఫోన్లో పరామర్శించారని తెలిపారు. దేశంలో నిరుద్యోగమే ప్రధాన సమస్య అని.. మంచి చదువుతోపాటు నైపుణ్యం పెంపొందించుకుంటే నిరుద్యోగ సమస్య నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, రాబోయే రోజుల్లో భారత దేశమే ప్రపంచానికి మార్గనిర్దేశం చేయనుందని ఆశా భావం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా ప్రజలు కార్యసిద్ధి కలవారని కొనియాడారు.

(గవర్నర్‌ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం)
Leave A Reply

Your email address will not be published.