తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 48,005 క‌రోనా నిర్దార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 491 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,599కి చేరింది. తాజాగా.. 596 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2,69,828 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం ఆరోగ్యశాఖ బులిటెన్ విడుద‌ల చేసింది.
కాగా, 7,272 కేసులు యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 5,169 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైరస్‌ ప్రభావంతో మరో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1499కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 96.85శాతంగా ఉందని, మరణాల రేటు 0.53శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 48,005 రక్త నమూనాలను పరిశీలించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 62,05,688 శాంపిల్స్‌ పరిశీలించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

Leave A Reply

Your email address will not be published.