క‌ర్ణాట‌క డిప్యూటీ చైర్మ‌న్‌ను లాక్కెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

విధాన స‌భ‌లో బాహాబాహీ

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌కలో విధాన‌స‌భ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ప‌రిష‌త్ డిప్యూటీ చైర్మ‌న్ ధ‌ర్మ‌గౌడ‌ను కుర్చీ నుంచి లాక్కెళ్లారు. అక్క‌డి స‌భ్యులంతా ప‌ర‌స్స‌రం బాహాబాహీకి దిగారు. కాంగ్రెస్ స‌భ్యుల‌ను అడ్డుకునేందుకు బిజెపి స‌భ్యులు య‌త్నించారు.

కాగా బిజెపి, జెడిఎస్‌లు చైర్మ‌న్‌ను అక్ర‌మంగా ఆ కుర్చీలో కూర్చోబెట్టాయ‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. స‌భ అదుపులో లేన‌ప్పుడు చైర్మ‌న్ త‌ప్పుకోవాల‌ని విమ‌ర్శించింది. అందుకోస‌మే ఇలా వ్య‌వ‌హ‌రించాల్సి వ‌చ్చింద‌ని కాంగ్రెస్ చెబుతోంది.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క విధాన స‌భ‌లో అధికార ప‌క్షం బిజెపి బ‌లం కొన‌సాగుతుండ‌గా.. ప‌రిష‌త్‌లో మాత్రం విప‌క్ష స‌భ్యుల బ‌లం ఉంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బిజెపి 4 స్థానాలు గెలుచుకొని పెద్ద‌ల స‌భ‌లో త‌మ బ‌లాన్ని 31కి పెంచుకుంది. ఈ సంఖ్య నిర్ణ‌యాత్మ‌కం కాక‌పోవ‌డంతో రాజకీయ ఆధిప‌త్యం చేతులు మారుతోంది. కాంగ్రెస్‌, జెడిఎస్ మైత్రి కాలంలో ప‌రిష‌త్తులో విప‌క్షాల ఆధిప‌త్యం జోరుగా సాగింది.

Leave A Reply

Your email address will not be published.