నేడు ఢిల్లీకి ఎపి ముఖ్య‌మంత్రి జగన్

అమరావతి: ఆంధ్ర‌ప‌దేశ్ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి చెందిన ఇతర అంశాలను అమిత్‌ షా దృష్టికి సీఎం తీసుకువెళతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Leave A Reply

Your email address will not be published.