ఏపీలో ఇక జన ఆరోగ్య సమితిలు..!

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన ఆరోగ్య సమితి (జేఏఎస్‌)లు ఏర్పాటు చేసేందుకు స‌ర్కార్‌ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జన ఆరోగ్య సమితిల ఏర్పాటుకు పూనుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ దీనికి సంబంధించిన నిబంధనలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జేఏఎస్‌లను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జేఏఎస్‌ ఛైర్మన్‌గా సంబంధిత గ్రామ సర్పంచ్‌ వ్యవహరించనుండగా, సహ ఛైర్మనుగా పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్, మెంబర్ సెక్రటరీగా మిడిల్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించాలంటూ స‌ర్కార్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజల్లో ఆరోగ్య సమస్యలు, వ్యాధులు పట్ల అప్రమత్తత, అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ జన ఆరోగ్య సమితి ఆయా గ్రామాల్లో పనిచేయనుంది.

Leave A Reply

Your email address will not be published.