బంగ్లాదేశ్‌తో స్నేహానికే మా తొలి ప్రాధాన్యం : ప్రధాని నరేంద్రమోడీ
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో సంబంధాలను బలపరచడమే తమ ప్రాధాన్యతగా నిలిచినట్లు ప్రధాని నరేంద్రమోడీ అన్నరు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి వర్చువల్ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్19 మహమ్మారి వల్ల అందరికీ అన్ని సవాళ్లు ఎదురయ్యాయని, ఇలాంటి సమయంలో బంగ్లాతో మంచి సహకారం అందిందని, హెల్త్ ప్రొఫెషనల్స్, కోవిడ్ టీకా అంశంలో రెండు దేశాలు కలిసి పనిచేసినట్లు మోదీ తెలిపారు. మహాత్మా గాంధీ, షేక్ ముజిబుర్ రెహ్మాన్‌లపై డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ఓపెన్ చేస్తున్నామని, ఆ ఎగ్జిబిషన్లు యువతకు ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. కోవిడ్19ను భారత్ ఎదుర్కొన్న తీరు పట్ల బంగ్లా ప్రధాని హసీనా ప్రశంసలు కురిపించారు. 1971 యుద్ధాన్ని గుర్తు చేసిన ప్రధాని షేక్ హసీనా… యుద్ధ వీరులకు నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. 1971 యుద్ధంలో వీరమరణం పొందిన భారత జవాన్లు కూడా ఆమె నివాళులు అర్పించారు. బంగ్లాదేశ్ స్వేచ్ఛ కోసం మనసుపూర్తిగా సహకరించిన భారత ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు హసీనా తెలిపారు.
Addressing the India-Bangladesh virtual summit with PM Sheikh Hasina. https://t.co/ewHLRWvVLZ
— Narendra Modi (@narendramodi) December 17, 2020