పి.ఎస్ఎ.ల్.వి. ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని నమోదు చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరికక్ష కేంద్రం నుంచి గురువారం ప్రయోగించిన పి.ఎస్ఎ.ల్.వి. సి -50 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. నిర్దశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విడిచిపెట్టిందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు.
25 గంటల కౌంట్‌డౌన్ తర్వాత మధ్యాహన్నం 3గంటల 41 నిమిషాలకు అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేసింది ఇస్రో. దీనికి సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ కూడా ముందే పూర్తయ్యాయి. ఈ శాటిలైట్ బరువు 1410 కిలోలు. అండమాన్, నికోబర్, లక్షద్వీప్‌లలో… ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవలను అందించనుంది. దేశంలో ఇకపై మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇది ఏడేళ్ల పాటు కక్షలో తిరుగుతూ ఉంటుంది. పి.ఎస్ఎ.ల్.వి. సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వ ప్రయోగం కాగా, షార్ నుంచి చేపడుతున్న 77వ మిషన్ ఇది.