ఏపీ కేబినెట్ నిర్ణయాలు..
అమరావతి: ఏపీ సిఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు ఆమోం సహా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం నిర్ణయం తీసుకంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని వివరాలు మీడియాకు వెల్లడించారు.
భూ సర్వే, సరిహద్దు చట్టంలో సవరణలకు మంత్రి వర్గం ఆమోదం తెలిసిందన్నారు. సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్ తయారీ చేస్తామని.. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూ సర్వే జరుగుతుందని మంత్రి వివరించారు. మూడేళ్లలో భూ సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలను జారీ చేస్తామన్నారు.
అలాగే.. రైతు భరోసా పథకం, ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చ జరగడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీని కేబినెట్ ఆమోదించింది. 6 జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు
- ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు ఆమోదం
- ఏ సీజన్‌లో పరిహారం ఆ సీజన్‌లోనే చెల్లించాలని నిర్ణయం
- నివార్ తుపాను బాధితులకు ఈనెలాఖరులోగా పరిహారం చెల్లిస్తాం
- చంద్రబాబు బకాయి పెట్టిన 1200 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాం
- ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు ఆమోదం
- ఏపీలో కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకానున్నాయి
- మొత్తం 27 మెడికల్ కాలేజీలకు రూ.16వేల కోట్ల నిధులు
- ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణకు ఆమోదం
- ప్రతీ భూమికి సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్ తయారు
- ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీని ఆమోదించిన కేబినెట్
- 6 జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం
- కొత్త పర్యాటక విధానానికి ఆమోదం
- కోవిడ్ కారణంగా దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్ట్‌లకు రీస్టార్ట్ ప్యాకేజీకి ఆమోదం
- రూ.198.05 కోట్ల పర్యాటక ప్రాజెక్ట్‌లకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఆర్థికసాయం
- హోటల్ రంగం రీస్టార్ట్ కోసం రూ.15 లక్షల వరకు రుణం
- మొదటి ఏడాదికి 4.5 శాతం రాయితీతో వడ్డీ రుణాలు
- సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్ ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం