ఉద్యోగ క‌ల్ప‌న‌కు మ‌రో ముందడుగు

ఎక్విఫాక్స్‌తో చేతులు క‌లిపిన `డీట్‌`

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో ఉద్యోగ క‌ల్ప‌న‌కు ఉద్దేశించిన డిజిట‌ల్ `డీట్‌` ఆమెరికాకు చెందిన మ‌ల్టీ నేష‌న‌ల్ కంజ్యూమ‌ర్ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ ఎక్విఫాక్స్‌తో చేతులు క‌లిపింది. ఈ ఒప్పందం ద్వారా యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు పెర‌గ‌డంతో పాటు, డిజిట‌ల్ యాప్‌లో సేవ‌ల విస్త‌ర‌ణ‌, ఉద్యోగార్థుల ఐటీ వెరిఫికేష‌న్‌, ఉద్యోగాల క‌ల్ప‌న సుల‌భం కానుంది. డిజిట‌ల్ యాప్‌లో న‌మోదైన నిరుద్యోగులు, ఎక్విఫాక్స్ ద్వారా రిజిస్ట‌ర్ అయిన సంస్థ‌ల నుంచి రుణ స‌దుపాయం పొందేందుకు వీలు క‌లుగుతుంది.

హ‌ర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్‌

ఈ భాగ‌స్వామ్యం ప‌ట్ల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఉద్యోగార్థుల వెరిఫికేష‌న్ వేగ‌వంత‌మై కంపెనీలు అర్హులైన మాన‌వ వ‌న‌రుల‌ను ఎంపిక చేసుకునేందుకు ఈ భాగ‌స్వామ్యం దోహదం చేస్తుంద‌న్నారు. ఐటి రంగంలో అవ‌కాశాల‌కు తెలంగాణ రాష్ట్రం బంగారు గ‌ని వంటిద‌ని కెటిఆర్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ప్రఖ్యాత కంపెనీలు, లక్షల మంది ఉద్యోగులతో రాష్ట్ర ఐటీ రంగం విరాజిల్లుతున్నదని చెప్పారు. రాష్ట్రంలోని యువతకు ఇతర రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెల్లడించారు. ప్రఖ్యాత కంపెనీలకు, లక్షల మంది ఉద్యోగులకు రాష్ట్రం వేదికగా మారిందని, ఇదే తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి పెడుతున్నదని చెప్పారు. ఈ క్రమంలో ‘డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ’ (డీఈఈటీ) ప్రఖ్యాత క్రెడిట్‌ రిపోర్టింగ్‌ ఏజెన్సీ ‘ఎక్విఫాక్స్‌’తో చేతులు కలుపడం ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. అభ్యర్థులకు అర్హత మేరకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు కంపెనీలకు సమర్థులైన సిబ్బందిని, లాభాలను అందించేలా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.