తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఐదుగురికి కరోనా

హైదరాబాద్: తెలంగాణ బిజెపి రాష్ట్ర ఆఫీసులో కరోనా కలకలం. కార్యాలయంలో పనిచేస్తున్న వారిలో ఐదుగురికి కనరోనా పాజిటీవ్ అని తేలింది. ఇప్పటికే రాష్ట్రకార్యదర్శి ప్రకాశ్‌రెడ్డికి కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే.. కొ్త్తగా కార్యాలయంలో 40 మందికి టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో కార్యాలయంలో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కార్యాలయ సిబ్బందిని క్యారంటైన్‌కి తరలించినట్లు నేతలు పేర్కొన్నారు. అలాగే కార్యాలయాన్నంతా శానిటైజేషన్ చేశారు. ఏది ఏమైనా పార్టీ కార్యాలయంలో కరోనా సోకడంతో నేతలంతా తగు జాగ్రత్తలు చేపట్టారు. వారం పాటు కార్యాలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.