బీజేపీకి అధికారం పగటి కలే : మంత్రి కొప్పుల

పెద్దపల్లి : 2023లో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు అనుకోవడం పగటి కలే అని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ర్ట వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ ఛుగ్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఒక్క దుబ్బాక అసెంబ్లీ, జీహెచ్ఎంసీలో కొన్ని స్థానాల్లో గెలిచిఅంత విర్రవీగితే, టీఆర్ఎస్ పార్టీ అనేక చారిత్రాత్మక విజయాలను సొంతం చేసుకుంది అని గుర్తు చేశారు. బెంగళూరుకు వరద సాయం రూ. 500 కోట్లు, అహ్మదాబాద్‌కు రూ. 600 కోట్లు ఇచ్చారు.. హైదరాబాద్‌కు వరద సాయం ఎందుకు ఇవ్వలేదు? భారతదేశంలో హైదరాబాద్ లేదా? అని ప్రశ్నించారు. బీజేపీని గెలిపిస్తే 15 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న అరవింద్ మాటలు ఏమయ్యాయి? అరవింద్ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు అని స్పష్టం చేశారు. 2023లో తిరిగి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోనికి వస్తుంది అని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.