`విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా గురుకుల పాఠశాలలు కృషి`

ఎల్లారెడ్డి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ “యురేకా – 2020” పోటీలను వివిధ విభాగాలలో డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ (అడిషనల్ డీ.జీ.పీ), కార్యదర్శి ఆదేశానుసారం తేదీ 20-12-2020 (ఆదివారం) రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గురుకులాలను ప్రోత్సహించి, పేద విద్యార్థులు విద్యను అభ్యసించి, వారు ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎల్లారెడ్డి పట్టణ సీ.ఐ రాజశేఖర్ మాట్లాడుతూ విద్య యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జి.మహేందర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలలోని పోటీల్లో నెగ్గిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమానాలు మరియు ప్రశంసాపత్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పట్టణ నాయకులు రాజు, సంతోష్, ఇమ్రాన్, సాయిలు, జగన్ మరియు విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల/కళాశాల సిబ్బంది మొదలైన వారు పాల్గొన్నారు.
పోటీలు నిర్వహించిన విభాగాలు
1. వ్యాసరచన ( Essay Writing ) – తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో
2. ఉపన్యాసం ( Elocution ) – తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో
3. చర్చ ( Debate ) – తెలుగు ఇంగ్లీష్ భాషలలో
4.క్విజ్ ( Quiz ) – ఇంగ్లీష్ భాషలో
5. Spell bee – ఇంగ్లీష్ భాషలో
6. నృత్యం ( Solo Dance ) – ఏదైనా భాషలో
7. ఏకపాత్రాభినయం ( Mono action ) – ఏదైనా భాషలో
8. పుస్తక సమీక్ష ( Book Review ) – ఏదైనా భాషలో
9. చేతివ్రాత ( Hand writing ) – ఏదైనా భాషలో
10. కథ చెప్పడం ( Story Telling ) – ఏదైనా భాషలో
11. బృందగానం ( Group Songs ) – ఏదైనా భాషలో
12. పాట పాడటం ( Solo Singing ) – ఏదైనా భాషలో
13. చిత్రలేఖనం ( Painting )
14. Super Students