సబ్ రిజిస్ట్రార్లతో ముగిసిన ఉన్నతాధికారుల టెలికాన్ఫరెన్స్

హైదరాబాద్ : సబ్రిజిస్ట్రార్లతో రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు జరిపిన టెలికాన్ఫరెన్స్ ముగిసింది. సోమవారం నుంచి జరిగే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్‌పై ఉన్నతాధికారులు సబ్రిజిస్ట్రార్లకు దిశానిర్దేశం చేశారు. కార్డ్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు యంత్రాంగాన్ని అధికారులు సమాయత్తం చేశారు. రద్దీ ఉంటే సంబంధిత సబ్ రిజిస్ట్రార్లు ముందస్తు టోకెన్లు జారీ చేయాలని సూచించారు. అదేవిధంగా డాక్యుమెంట్ల పరిశీలనలో జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.