పులిగుండాలలో గ‌ల్లంతైన‌ ముగ్గురూ మృతి

ఖమ్మం : జిల్లాలోని పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్ట్‌లో గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు.నీటిలో మునిగిన రామ‌న‌ర్సింహారెడ్డి(21), శీలం చలపతి రెడ్డి(25), వేమిరెడ్డి సాయి(18) మృతి చెందారు. ముగ్గురి మృత‌దేహాల‌ను స్థానికులు వెలికితీశారు. దీంతో మృతుల స్వ‌గ్రామం క‌ల్లూరు మండ‌లం బ‌త్త‌ల ప‌ల్లి లో విశాద‌చాయ‌లు అల‌ముకున్నాయి.

8 మంది యువకులు ఉదయం పులిగుండాల ప్రాజెక్టులో సరదాగా ఈతకు వెళ్లారు. వీరిలో ఐదుగురు ఈతకు నీటిలోకి దిగారు. ప్రవాహ ఉధృతిలో ఐదుగురు కొట్టుపోతుండగా ఇద్దరిని స్థానికులు రక్షించారు. సమాచారం మేరకు పెనుబల్లి, కల్లూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గల్లంతైన వారికోసం స్థానికుల సాయంతో గాలింపు చేపట్టారు. ఆదివారం రాత్రి ముగ్గురు మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.