షేక్.బహర్ అలీ: గ్యాస్ ట్ర‌బుల్‌కి సింపుల్ చిట్కాలు..

మనలను వివిధ రకాల ఇబ్బందులకు, అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో గ్యాస్‌ ట్రబుల్‌ ప్రధానమైనది. గ్యాస్‌ ట్రబుల్‌ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి. ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం, నిరంతర ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి వేధిస్తోంది. అనేక ఇబ్బందులకు గురిచేసే ఈ సమస్య గురించిన సరైన అవగాహన ఉంటే దీనిని ఎదుర్కొనడం కష్టమేమీ కాదు.

గ్యాస్, అజీర్తి, కడుపుబ్బరం, ఆకలి లేకపోవటం, వీటికి ఆయుర్వేద చిట్కా, ఈ క్రింది విధంగా తయారుచేసుకోండి.

  • 100 గ్రాములు ధనియాలు.
  • 100 గ్రాములు సొంపు
  • 200 గ్రాములు పటికబెల్లం
(త‌ప్ప‌క చ‌ద‌వండి: షేక్.బహర్ అలీ: దొండపండు లాంటి పెదవులపై.. చిరు వ్యాయామం)

ధనియాలు,సొంపు పెనంలో వేసి దోరగా వేయించి మిక్సీ లో వేసి పలుగులుగా ఉండేటట్లు చేసుకోవాలి.పటికబెల్లం రోలులో వేసి మెత్తగా దంచి ఈ మూడు కలిపి ఒక గాజు సీసాలో ఉంచుకొని ,ఉదయం టిఫిన్ తరువాత రాత్రి భోజనం తరువాత 1 టీ స్పూన్ నోటిలో వేసుకుని బాగా నమిలుతూ సప్పరిస్తూ మింగాలి.
హెచ్చరిక: షుగర్ పేషెంట్స్ ఉంటే పటికబెల్లం కలపకుండా తినాలి.

-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు.

Leave A Reply

Your email address will not be published.