షేక్.బహర్ అలీ: దొండపండు లాంటి పెదవులపై.. చిరు వ్యాయామం
శీతాకాలము శరీరానికి చలి ఎక్కువగా ఉంటుంది.కానీ పెదవులు ఎక్కువగా సున్నితంగా ఉండుట వలన వాటిపై శీతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.శీతాకాలం రాగానే పెదవులు పగులుతాయి.పెదవులు పగలటం వలన నవ్వలేము, ఏడ్వలేము, మాట్లాడలేము, అన్నం సరిగ్గా తినలేము,టీ తాగలేము,కష్టంగా ఉంటుంది.పెదవులు స్వయంకృత ప్రజ్ఞాపరాధన వలన పగులుతాయి (అశ్రద్ధ).పెదవులు పగిలి చర్మం నుండి రక్తం రావటం కూడా జరుగుతుంది.
(మొదటిభాగం తప్పక చదవండి: షేక్.బహర్ అలీ: శీతాకాలంలో పెదవులు పగులుతున్నాయా?)
-
పెదవులపై పొర లేచినపుడు రాత్రి పడుకునే ముందు పెదాలపై బాదం నూనె రాసుకుని నిదురించాలి. పెదవులు మృదువుగా అవుతాయి.పెదవులను గోకటం కానీ పళ్ళతో కొరకటం కానీ చేయరాదు.
-
నల్లగా మారిన పెదాలకు గులాబీ జలంలో గ్లిజరిన్ కలిపి పెదలపైన రోజు రాయాలి.
-
చూపుడు వేలు ముందు భాగాన్ని పెదవుల కొనలపై ఉంచి లోపలి వైపు మాలిష్ చేయాలి.
-
చూపుడు వేలు ముందు భాగాన్ని పెదవులపై ఉంచి గడియారం ముళ్ళు తిరిగే దిశలో మరియు వ్యతిరేక దిశలో కూడా మాలిష్ చేయాలి.
-
నవ్వే సమయంలో విచ్చుకున్న భాగాన్ని చూపుడు వ్రేలితో లోపలి వైపు నిదానంగా మాలిష్ చేయాలి.
-
పెదవులపై వెన్న,పంచదార రాసిన మంచిగా వుంటాయి.
-
ఎండ వలన పెదవులు నల్లబడతాయి.వారికి తగిని ఆయుర్వేదిక్ ముందుకు వాడాలి.
-
పెరుగు,మీగడ,కుంకుమపూవ్వు,పెదలపైన రాసుకుంటే ఆరోగ్యముగా ఉంటాయి.పెడవులపైన మృతకణాలు పోతాయి.
-
చక్కని ఆయుర్వేద మెడిసిన్ డాక్టర్ సలహా మేరకు లవంగా తైలం పెదలపైన రాయండి.తేనే,గులాబీ జలం చాలా రకముకల ఆయుర్వేద మందులు వున్నాయి. వైద్యుడి సలహా మేరకు వాడండి.
-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు