ముక్కోటి ఏకాద‌శికి ముస్తాబు అవుతున్న `ధ‌ర్మ‌పురి`

ధర్మపురి : డిసెంబర్‌ 25 శుక్రవారం జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలనుధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మినరసింహస్వామివారి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ సిబ్బంది భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈఏడు కొవిడ్‌‌ నిబంధనల మేరకు ముక్కోటి ఉత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాట్లు, జగోపురాలతో పాటు అన్ని దేవాలయాలకు విద్యుత్‌ దీపాలు, పూలదండలతో అలంకరణచేసి, టెంట్లువేసి, మంచినీటి సౌకర్యం కల్పించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భక్తులకు సరపడా లడ్డూ, పులిహోరా ప్రసాదాల అద‌న‌పు త‌యారీకి చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ముక్కోటి ఏకాదశి పూజలు..

ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సంధర్భంగా డిసెంబర్‌25 శుక్రవారం రోజున ప్రాతఃకాలం 2.30 గంటలకు లక్ష్మీసమేత యోగ, ఉగ్రనరసింహ, శ్రీవెంకటేశ్వర స్వాములవారి మూలవిరాట్‌లకు మహాక్షీరాభిషేకాలు, నివేదన, మంత్ర పుష్పములు, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రాతఃకాలం 4 గంటలకు వైకుంఠద్వారం వద్ద పుష్పవేదికపైన ఆసీనులై ఉన్న మువ్వురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనలు,నివేదనలు, సప్తహారతుల సమర్పణ, మంత్రపుష్పము, అనంతరం వేదఘోష, మహాదాశీర్వచనములు జరుగుతాయి. ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళవాయిద్యాలు వెంటరాగా వేద మంత్రోచ్చరణల మద్య ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి శ్రీమత్‌ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ సచ్చినాంద సరస్వతి మహాస్వామి, గుంటూరుకు చెందిన దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్‌ గారల కరకములచే వైకుంఠ ధర్శన పూజ నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వారం తెరిచి.. ద్వారం ద్వారా క్యూలైన్లో భక్తులకు స్వామివారల వైకుంఠ ద్వార దర్శనం, తీర్థప్రసాద వితరణ ఉంటుందని ఈఓ వివరించారు… కాగా ప్రతీ సంవత్సరం మాధిరిగా ఏ ఈడాది ఉత్సవ మూర్తుల సేవలను పురవీదులు గుండా ఊరేగింపు సేవ రద్దు చేశారు…

ఈ నెల 25న ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని ఆల‌య ఈవో శ్రీనివాస్ తెలిపారు. కోవిద్‌ నిబందనల మేరకు ఏర్పాటు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. కాగా కోవిద్‌ కారణంగా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ముక్కోటి ఏకాదశి రోజున పురవీదుల గుండా స్వామివారి ఊరేగింపు సేవలను రద్దు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.