ఎల్లారెడ్డి: ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సిద్దిరాంగౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

కామారెడ్డి: ఎల్లారెడ్డి నూతన ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా సిద్దిరాం గౌడ్ ను ఏకగ్రీవంగా కమిటీ సభ్యులు ఎన్నుకున్నట్లు ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రాజ్ కుమార్ సోమయాజులు తెలిపారు. మంగళవారం ఎల్లారెడ్డి టౌన్ లో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకొని జర్నలిస్ట్ ఐక్యత కోసం కృషి చేస్తామని తీర్మానం చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా సిద్దిరాం గౌడ్, జాయింట్ సెక్రెటరీ గ యాశ్వంత్ రావ్,వైస్ ప్రెసిడెంట్ లుగా రమేష్, ముక్రం, క్యాషియర్ గా ప్రమోద్ గౌడ్, సహాయ కార్యదర్శులుగా సత్యనారాయణ, బాలు, డైరెక్టర్లుగా రాజాగౌడ్, కొడకల గోవర్ధన్, సాయిరాం గౌడ్, రఘు గౌడ్, రవీందర్, రాజేష్, గౌస్, పోచయ్య, ఆకుల వెంకట్, సంగ్రామ్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అలాగే జర్నలిస్ట్ సమస్యల పరిష్కరం కోసం నూతనంగా అడహాక్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులుగా సోమయాజులు రాజ్ కుమార్, ఆదిమూలం సతీష్, ప్యాలాల రాములు, శంబు లింగంను ఏర్పాటు చేసినట్లు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం నూతన ప్రెసిడెంట్ సిద్దిరాం గౌడ్, జాయింట్ సెక్రెటరీ యాశ్వంత్ రావ్ మాట్లాడుతూ.. జర్నలిస్ట్ సమస్యలపై పోరాటం చేసి.. జర్నలిస్ట్ హక్కులను పోరాడి సాదించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.