మాసాయిపేట మండల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అంగీకారం

హైదరాబాద్: మెదక్ జిల్లా తుప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి వినతి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. చేగుంట మండలంలోని 3 గ్రామాలు, ఎల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు కలిపి మొత్తం 9 గ్రామాలతో మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నూతన మండల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి.