ఎన్‌టిఆర్ జిల్లాలోని సిమెంట్ కార్మాగారంలో పేలిన బాయిల‌ర్ ..20 మందికి గాయాలు

జ‌గ్గ‌య్య‌పేట (CLiC2NEWS): ఎన్‌టిఆర్ జిల్లా బోద‌వాడ‌లోని సిమెంట్ ప‌రిశ్ర‌మ‌లో బాయిల‌ర్ పేలి ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను జ‌గ్గ‌య్య‌పేట‌, విజ‌య‌వాడ ఆస్పత్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్రీ హీట‌ర్ లోపం కార‌ణంగా పేలుడు జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. గాయ‌ప‌డిన వారు బిహార్‌, యుపి, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వాసులుగా గుర్తించారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై నివేదిక ఇవ్వాల‌ని కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ అధికారుల‌ను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.