నగరంలో మరో చిన్నారిపై వీధికుక్క దాడి
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో ఎక్కడ చూసిన వీధికుక్కలు ఎక్కువైపోతున్నాయి. దీంతో చిన్నారులు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లోని శాంతినగర్‌లో గురువారం రాత్రి ఓ చిన్నారిపై వీధి కుక్క దాడిచేసి గాయపరిచింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపైకి వచ్చింది. వారు పారిపోతుండగా ఐదేళ్ల చిన్నారి కిందపడిపోయాడు. దీంతో కుక్క బాలుడిని గాయపరిచింది.